చిట్వేల్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అధికారులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. “మూడు నెలల్లోపుగా పనితీరును మెరుగుపరచాలి. ప్రజల సమస్యల పరిష్కారమే మన ప్రధాన ధ్యేయం” అని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రజా సేవకు తన కట్టుబాటును వ్యక్తం చేశారు.