తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G.O నెం. 9పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సంబంధిత బిల్లు గవర్నర్ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నప్పటికీ జీఓ ఇవ్వడంపై కోర్టు ప్రశ్నించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మొత్తం 50% పరిమితిని దాటిపోతుందని పిటిషనర్లు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కూడా కోర్టు ఆదేశించింది.