వంతెన నిర్మాణం కోసం పరిశీలన
NEWS Oct 08,2025 10:34 pm
అనంతగిరి మండలం గరుగుబిల్లి ప్రధాన రహదారిపై హై లెవల్ వంతెన నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించినట్టు టీడీపీ అనంతగిరి మండల క్లస్టర్ ఇన్‌చార్జి పెరుమాళ్ నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గరుగుబిల్లి, రొంపల్లి పంచాయతీల ప్రజలు రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాగులు దాటడం కోసం ప్రజలు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని, వర్షాకాలంలో వంతెనల లేమితో అనేక ప్రాణనష్టాలు సంభవించాయని పేర్కొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా వంతెన నిర్మాణం అత్యవసరమని ఆమె అన్నారు.