పాల ఉత్పత్తిదారుడికి పుస్తెమట్టెలు అందజేత
NEWS Oct 08,2025 08:32 pm
రాఘవపేట గ్రామానికి చెందిన పాల ఉత్పత్తిదారుడు మైలారపు నరేష్ కుమార్తె వివాహం సందర్భంగా, కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో అమలవుతున్న డెయిరీ కళ్యాణ మస్తు పథకంలో భాగంగా పుస్తె మట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మేనేజర్ రవీందర్ రావు, అసిస్టెంట్ మేనేజర్‌లు లక్ష్మిపతి, ప్రదీప్, రవి ప్రసాద్, సూపర్‌వైజర్ రమేష్, నరేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. డెయిరీ అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం కరీంనగర్ డెయిరీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.