కుటుంబ పెద్ద చనిపోతే ₹20 వేలు
NEWS Oct 08,2025 03:32 pm
కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థిక సహాయం అందించే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBC/NFBS) కింద కేంద్ర ప్రభుత్వం ₹ 20,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల కుటుంబ పెద్ద (18-60 మధ్య వయస్సు) చనిపోతే, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. మరణించిన రెండేళ్ల లోపు కుటుంబ సభ్యులు మరణ, కుల ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.