ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం! రాయవరం మండలం వెదురుపాక సావరం ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసి, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారి పరిస్థితి గంభీరంగా ఉంది.