బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు
NEWS Oct 08,2025 03:14 pm
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు GOపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు బిల్లు అసెంబ్లీలో పాస్ అయిందా అని అడిగింది. అడ్వకేట్ జనరల్ చెప్పిన వివరాల ప్రకారం, బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యి గవర్నర్ వద్ద ఉంది. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయినా, రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ అయితే ఎన్నికలు రద్దు అవుతాయని పిటిషనర్ల లాయర్లు వాదించారు. అలాగే, వన్‌మెన్ కమిషన్ నివేదికను ఇంకా బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.