ఉపఎన్నికపై చంద్రబాబు కీలక నిర్ణయం
NEWS Oct 08,2025 12:23 pm
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయదని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అమరావతిలో నేతలతో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పార్టీ శ్రేణులు సిద్ధంగా లేవన్న అభిప్రాయంతో తటస్థంగా ఉండాలని సూచించారు. బీజేపీతో పొత్తు కారణంగా వారికి వ్యతిరేకంగా వెళ్లరని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మద్దతు ఉండదని తెలిపారు. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను గుర్తుచేస్తూ, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నేతలకు ఆదేశించారు.