గర్భస్థ శిశువు ఎదుగుదలకు విటమిన్ D చాలా అవసరమని పెన్‌స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇది స్కెలిటన్ అభివృద్ధి, ప్లాసెంటా పనితీరు, తల్లి రోగనిరోధక శక్తికి కీలకం. లోపం ఉంటే నెలలు నిండకముందే ప్రసవం లేదా శిశువు పొడవు తక్కువగా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భధారణకు ముందే విటమిన్ D స్థాయిలను పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.