బుచ్చయ్యపేట మండలం ఆర్.భీమవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం వర్షం పడింది. ఆ సమయంలో పడిన పిడుగుకు పాడి ఆవు మృతి చెందింది. మృతి చెందిన పాడి ఆవు సుమారు రూ.70,000 ఉంటుందని బాధిత రైతు రొంగలి చిన్ననాయుడు తెలిపారు. ఆవుకు గ్రామస్థులందరూ కలిపి అంత్యక్రియలు నిర్వహించారు. ఆవు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.