గొల్లపేట ప్రజలకు తాగునీటి కష్టాలు
NEWS Oct 08,2025 01:06 pm
చోడవరం నియోజకవర్గం, రోలుగుంట మండలం, కొత్తూరు పంచాయతీ పరిధిలోని గొల్లపేట గ్రామంలో సుమారు 50 కుటుంబాలు, 250 మంది జనాభా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2023-24లో జల జీవన్ మిషన్ కింద రూ. 22 లక్షల నిధులతో నిర్మించిన 10,000 లీటర్ల వాటర్ ట్యాంక్, ప్రత్యేక బోరు, షెడ్, ఇంటింటా పైపులైన్ సదుపాయాలు ఏర్పాటు చేసినా, ట్యాంక్ ద్వారా కేవలం రెండు రోజులు మాత్రమే నీటి సరఫరా జరిగిందని, ఆ తర్వాత నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని గ్రామస్తులు తెలిపారు.