మొక్కజొన్న సాగులో మంచి దిగుబడి రావడంతో ఆనందంలో రైతులు
NEWS Oct 08,2025 01:20 am
ఇబ్రహీంపట్నం: వర్షకొండ గ్రామంలో, దోమకొండ చిన్న రాజన్న పయనీర్ P35105 రకం మొక్కజొన్న 3 ఎకరాల్లో సాగు చేసి మంచి దిగుబడిని పొందారు. పయనీర్ సంస్థ జిల్లా సేల్స్ ఆఫీసర్ మనీషా రైతును శాలువాతో సత్కరించారు. గతంలో తాను ఇతర విత్తనాలను నాటానని, కానీ అవి ఇంత దిగుబడిని ఇవ్వలేదని, ఈ పంటకు మంచి వేర్లు ఉన్నాయని, కంకి ఏకరీతిగా ఏర్పడతాయని, మంచి ధాన్యం బరువు , మంచి కలర్ ఉందని ఇది రైతుకు మంచి లాభాలను తెస్తుందని రాజన్న అన్నారు. ఈ కార్యక్రమం లో ఇబ్రహీంపట్నం మండలం పయనీర్ ప్రతినిధి సురేష్, గ్రామ రైతులు తుక్కారాం, విజయ్, అశోక్, శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.