జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఖరారు
NEWS Oct 08,2025 01:19 am
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన జూమ్ సమావేశంలో ఆయనకు ఎక్కువమంది మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బొంతు రామ్మోహన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ, కాంగ్రెస్ విజయం కోసం తాను పూర్తి మద్దతు ఇస్తానని తెలిపారు. ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.