“ఎన్నికల్లో పోటీ చేస్తే ఇదే గతి”
NEWS Oct 07,2025 07:54 pm
మల్లాపూర్: గుండంపల్లి గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ ప్రకటించడంతో గ్రామ రాజకీయాల్లో హీటు మొదలైంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్లి బైక్‌ను పార్క్ చేసి పనులు చేసుకుంటున్నాడు. అప్పుడు గుర్తు తెలియని దుండగులు బైక్‌ను ముక్కలు ముక్కలుగా ధ్వంసం చేశారు. “ఎన్నికల్లో పోటీ చేస్తే నీకూ ఇదే గతి” అని హెచ్చరికగా అట్టముక్కపై రాసి ఉంచారు. ఈ ఘటనతో బాధితుడు, గ్రామస్తులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. పోలీసులు విచారణ చేపట్టారు.