వార్డులో డ్రైనేజ్ పరిశుభ్ర పనులను పరిశీలించిన కమిషనర్
NEWS Oct 08,2025 01:19 am
మెట్ పల్లి: పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నందున పలు వార్డులలో పర్యటించి జెసిబి ద్వారా మురికి కాలువలు క్లీన్ చేయిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. వార్డులలో మెయిన్ డ్రైనేజ్ వర్షపు నీరు ఎక్కడ ఆగకుండా జెసిబి ద్వారా తీయించడం జరుగుతుందని, వార్డులలో వర్షానికి విపరీతంగా మురికి కాల్వల వెంబడి గడ్డి పిచ్చి మొక్కలు పెరిగి పోవడం వలన పారిశుద్ధ్య సిబ్బందిచే మురికి కాలువలు తీయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్ నరేష్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.