బడ్జెట్‌లోనే 'బంగారు' నగలు!
NEWS Oct 07,2025 03:39 pm
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆభరణాల కోసం ప్రత్యామ్నాయ ఫ్యాషన్ ట్రెండ్స్ వస్తున్నాయి. బడ్జెట్‌లో బంగారం కొనాలనుకునే వారు తక్కువ స్వచ్ఛత ఉన్న 18k, 14k, లేదా 9k బంగారు ఆభరణాలపై మొగ్గు చూపుతున్నారు. వీటి ధర తక్కువగా ఉన్నా, మెరుపులో మాత్రం తేడా ఉండదు. అలాగే, బంగారు పూత పూసిన వెండి ఆభరణాలు, పంచలోహాల నగలు కూడా బంగారానికి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. లైట్-వెయిట్ ఆభరణాలకు కూడా మంచి గిరాకీ ఉంది.