పోటీకి బీఎస్పీ సిద్ధం!
NEWS Oct 07,2025 03:43 pm
కోరుట్ల: రాబోయే స్థానిక ఎన్నికల్లో BSP పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. ఆయన సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడు బొల్లంపల్లి సంపత్ కుమార్, నియోజకవర్గ ఇంచార్జులు, అధ్యక్షులు తమ రాజ్యాంగ హక్కుల ప్రకారం అభ్యర్థులను ప్రకటించాలని ఆదేశించినట్లు బీఎస్పీ కోరుట్ల ఇంచార్జి బబ్బిలి అక్షయ్, అధ్యక్షుడు గుజ్జరి ప్రకాష్ తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి జెడ్పీటీసీ, ఎంటీపీసీ స్థానాలకు బీఎస్పీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు వారు తెలిపారు.