ప్రసవాల పెరుగుదలపై కలెక్టర్ సత్కారం
NEWS Oct 07,2025 03:44 pm
పెద్దపల్లి: జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సెప్టెంబర్ నెలలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగడంతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్య సిబ్బందిని సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం వైద్య రంగానికి గర్వకారణమని, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణలో వైద్యులు చూపిస్తున్న అంకితభావం ప్రశంసనీయమని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ శ్రీధర్, వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ సత్కారం సిబ్బందిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.