తిరుమలలో థ్రెట్ మెయిల్స్ తో అలజడి
NEWS Oct 07,2025 11:19 am
ఆగని బెదిరింపు మెయిల్స్ తో తిరుపతిలో ఆందోళన నెలకొంది. ఎయిర్ పోర్ట్ తో బాంబు బెదిరింపు మెయిల్స్ పరంపర హోటల్స్ కు ఆలయాలకు వస్తుండడంతో అలజడి నెలకొంది. వరుస బెదిరింపు మెయిల్స్ పోలీసు యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వస్తున్న మెయిల్స్ IP అడ్రస్ లను VPN టెక్నాలజీతో కుస్తీలు పడుతున్నారు సైబర్ ఎక్స్ పర్ట్స్స్. ప్రతి థ్రెట్ మెయిల్ ను సీరియస్ గా తీసుకొని తనిఖీలు చేస్తున్న పోలీసు టీమ్స్ సైబర్ టెక్నాలజీ ద్వారా మెయిల్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.