'కాంతార' థియేటర్లో పంజుర్లి దేవుడి ప్రత్యక్షం
NEWS Oct 07,2025 11:10 am
తమిళనాడులోని దిండిగల్‌లో ఓ థియేటర్‌లో 'కాంతార చాప్టర్ 1' సినిమా ప్రదర్శితమవుతోంది. ఉన్నట్టుండి పంజుర్లి దైవం వేషధారణలో ఓ వ్యక్తి థియేటర్‌లోకి ప్రవేశించాడు. తెరపై రిషబ్ శెట్టి చేస్తున్న నృత్యాన్ని అచ్చుగుద్దినట్లు అనుకరిస్తూ డాన్స్ చేయడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిజంగానే దైవం ఆవహించిందేమోనని కొందరు భ్రమపడ్డారు. ఈ దృశ్యాలు చూసి తమకు గూస్‌బంప్స్ వచ్చాయని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.