నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు
NEWS Oct 07,2025 11:04 am
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసులో ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈసీ నిబంధనలు ఉల్లంఘించి ఓటర్ కార్డులను పంపిణీ చేయడంతో చర్యలకు దిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించి, మధురా నగర్ పోలీసులకు ఎన్నికల అధికారి రజినీకాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వచ్చే నెల 11న ఇక్కడ ఉపఎన్నిక జరగనుంది.