జడ్పీ చైర్మన్ పదవి ఆదివాసీలకే ఇవ్వాలి
NEWS Oct 07,2025 03:45 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ పదవి ఆదివాసీలకే ఇవ్వాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్ డిమాండ్ చేశారు. పినపాక మండలం జానంపేట గ్రామంలో జరిగిన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు మడివి రమేష్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రిజర్వేషన్లు అమలు చేయరాదని, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పూర్తిగా ఆదివాసీలకే కేటాయించాలన్నారు.