శబరి స్మృతి యాత్ర సందర్భంగా వివిధ ప్రదేశాల నుండి వచ్చిన గిరిజన భక్తులను ఆలయానికి తీసుకొని వస్తున్నామని ఆలయ ఈవో దామోదర్ తెలియజేశారు. మంగళవారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి తీసుకురావడానికి సిబ్బంది వెళ్లి గిరిజన భక్తులను సాంప్రదాయ సిద్ధంగా ఆలయానికి తీసుకొని వచ్చారు. రాముడికి గిరిజనులకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శబరి యాత్ర ఏటా ఘనంగా నిర్వహిస్తామని ఆలయ సిబ్బంది చెప్పారు. భద్రాచలం మొత్తం ఎటు చూసినా జైశ్రీరామ్ నామంతో మారుమోగుతుంది.