కే.కోటపాడు పౌష్టికాహార మహోత్సవాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే...
NEWS Oct 07,2025 12:18 am
కే.కోటపాడు: మండల కేంద్రంలోని స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— చిన్నారుల ఆరోగ్యాభివృద్ధి, మహిళల పోషకాహారం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ఈ దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. మండల NDA కూటమి నాయకులు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.