నీళ్లు బంద సోంపురం బంద లు గ్రామస్తులు వినూత్నంగా కాడాలతో నిరసన..
NEWS Oct 07,2025 12:16 am
రావికమతం: రోలుగుంట మండలం పరిధిలోని ఆర్ల పంచాయతీ, రావికమతం ప్రాంతాల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోంపురం, రావికమతం గ్రామాల్లో ఉన్న పీవీటీజీ (PVTG) గిరిజన కుటుంబాలు విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో జీవనం సాగిస్తున్నాయి. సుమారు 40 మంది జనాభాతో ఉన్న ఈ గ్రామానికి జన్మన్ పథకం ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించినా, పాత ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతినడంతో గత 3 నెలలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వారు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా “కొత్త ట్రాన్స్‌ఫార్మర్ వచ్చిన వెంటనే అమర్చుతాం” అంటూ హామీ ఇవ్వడమే తప్ప చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. చీకట్లో బతుకుతూ, దీపాల వెలుగులో భోజనం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ నిర్లక్ష్య వైఖరిపై నిరసనగా డిఇ కార్యాలయం, నర్సీపట్నం వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రకటించారు. ఆయన ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.