లంగుపర్తిలో పోషణ మాస వారోత్సవాలు.
NEWS Oct 07,2025 08:49 am
అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ పెదబయలు, పులుసు మామిడి అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ మహా వారోత్సవాలలో భాగంగా సూపర్ వైజర్ విమల కుమారి ఆధ్వర్యంలో పోషణ మాస వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సూపర్ వైజర్ విమల కుమారి, ఏఎన్.ఎం లీలావతి మాట్లాడుతూ.. పోషణ మహా వారోత్సవాలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. తల్లులు,పిల్లలు పౌష్టికాహర అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తూ పోషకాల గురించి వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు వసుందర దేవి, కొండమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు..