డిప్యూటీ సీఎం సార్.. మా బాధలు వినండి!!
NEWS Oct 07,2025 12:14 am
అనంతగిరి: ఎన్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని లివిటి గ్రామ గిరిజనులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారినా తమ గ్రామ పరిస్థితులు మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ — “మా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. వర్షాకాలంలో వర్షపు నీటినే తాగాల్సి వస్తోంది. దీంతో చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లాలన్నా సరిగ్గా రోడ్డు లేక రాళ్లతో నిండిన మార్గంలో నడవలేకపోతున్నారు” అని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ప్రభుత్వం తక్షణమే స్పందించి తాగునీరు, రహదారి వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించి తమకు న్యాయం చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.