రేవంత్ ఆడిస్తున్న నాటకం: తీన్మార్ మల్లన్న
NEWS Oct 06,2025 04:29 pm
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్ల వెనుక CM రేవంత్ రెడ్డి ఉన్నారని టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. ఇది వందకు వంద శాతం నిజమని, బీసీలను మోసం చేసేందుకే ప్రభుత్వం ఈ నాటకం ఆడుతోందని ఆయన విమర్శించారు. "రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలను నియంత్రించగలిగే శక్తి ఉన్న CM.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులను ఆపలేరా?" అని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా బీసీలకు దక్కుతున్న హక్కులను అడ్డుకోవద్దని ఆ ఇద్దరినీ సీఎం ఎందుకు ఒప్పించలేకపోతున్నారని నిలదీశారు. "రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చేది రెడ్డి CM అయితే, దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్లేదీ రెడ్లే ఆ కేసుల్లో వాదించే న్యాయవాదులు కూడా రెడ్లే" అంటూ మల్లన్న ఎద్దేవా చేశారు.