వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
NEWS Oct 06,2025 04:19 pm
మెడిసిన్ విభాగంలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఇ బ్రున్‌కో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకాగుచీకి ఈ అదృష్టం వరించింది. వీరిలో మేరీ ఇ బ్రున్‌కో, ఫ్రెడ్ రామ్స్‌డెల్.. ఇద్దరు శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన వారు కాగా.. షిమన్ సకాగుచీ జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త. రోగనిరోధక వ్యవస్థను ఎలా అదుపులో ఉంచుతారనే దానిపై పరిశోధన చేసినందుకు ఈ ముగ్గురికీ నోబెల్ బహుమతి వరించినట్లు నోబెల్ జ్యూరీ వెల్లడించింది.