‘కాంతార ఛాప్టర్-1’ 4 రోజుల్లో ₹310 కోట్లు
NEWS Oct 06,2025 11:55 am
రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ మూవీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ₹ 310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. నిన్న ₹65 కోట్లకుపైగా కలెక్ట్ చేసిందని పేర్కొన్నాయి. అటు బుక్ మై షోలో నిన్న మధ్యాహ్నం వరకు 50 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని మూవీ యూనిట్ పేర్కొంది.