ప్రపంచకప్‌లో పాక్ పై భారత్ ఘన విజయం
NEWS Oct 05,2025 11:10 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో టీమిండియా 88 పరుగుల భారీ తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 248 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ చేతులెత్తేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (23), ప్రతిక రావల్ (31) శుభారంభం అందించారు. హర్లీన్ డియోల్ (46) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.