ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
NEWS Oct 05,2025 05:32 pm
కోరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం 1997-98 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముస్లిం వెల్ఫేర్ సంఘం కోరుట్ల అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు మహమ్మద్ చాంద్ పాషా అధ్యక్షత వహించారు. పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్య బోధించిన గురువులను శాలువాలతో సత్కరించారు. విద్యార్థులు తమ విద్యా దశలో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గురువులతో కలిసి భోజనం చేసి ఆనందంగా రోజంతా గడిపారు.