క్షతగాత్రునికి MLA ప్రథమ చికిత్స
NEWS Oct 05,2025 10:58 pm
మెట్‌పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండాపూర్‌కు చెందిన యేలేటి శ్రీధర్ గాయపడ్డాడు. బైక్‌ను ఢీకొన్న కారు ప్రభావంతో శ్రీధర్ గాల్లో ఎగిరి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సమయంలో అటుగా వెళ్తున్న కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ క్షతగాత్రుణ్ణి పరిశీలించి, వెంటనే ఆటోలో మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.