మెట్ పల్లిలో దొంగల హల్చల్! తూతూ మంత్రంగా పోలీసుల పెట్రోలింగ్
NEWS Oct 05,2025 10:56 pm
మెట్ పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో గత 3 రోజులుగా రాత్రిపూట దొంగలు హల్ చల్ చేస్తున్నారు. ఇళ్లల్లో గేట్ల లోపల ఉండే స్కూటీ, వస్తువులను ఎత్తుకెళ్లి సమీప కాలువలో పడేశారని తెలిపారు. ముఖానికి బట్టలు కట్టుకొని నలుగురు వ్యక్తులు గేట్లు దూకుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తూతూ మంత్రంగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.