బిట్‌కాయిన్ ఆల్ టైం రికార్డు!
NEWS Oct 05,2025 08:43 pm
బిట్‌కాయిన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 1,25,245.57 డాలర్ల ( ఒక బిట్‌కాయిన్ విలువ రూ.1.11 కోట్లు) వద్ద ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది ఆగస్టు మధ్యలో నమోదైన 1,24,480 డాలర్ల రికార్డును ఇది అధిగమించింది. సాయంత్రం వరకు కూడా బిట్‌కాయిన్ 1.55 శాతం లాభంతో 1,24,353.96 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.