ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
NEWS Oct 05,2025 06:57 pm
TPCC చీఫ్ మహేశ్ కుమార్ సహా మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. BCలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడంతో ప్రభుత్వ వాదనలు విన్పించాలని సీనియర్ లాయర్లను వీరు కలుస్తారు. అటు ఇప్పటికే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉద్దేశం వివరించి పోలింగ్‌కు మార్గం సుగమం అయ్యేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి వీరికి సూచించారు.