నిమజ్జనం అనంతరం కంపోస్ట్ యాడ్‌కు
NEWS Oct 05,2025 07:02 pm
మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆదేశాల మేరకు సద్దుల బతుకమ్మ పండుగ అనంతరం బతుకమ్మ ఘాట్ల వద్ద నిమజ్జనమైన ఎంగిలిపూల బతుకమ్మలను కంపోస్ట్ యార్డ్‌కు తరలించారు. కమిషనర్ మాట్లాడుతూ ఈ పూలను కంపోస్టుగా మార్చి పట్టణంలోని డివైడర్లు, నర్సరీలు, మొక్కల పెంపకానికి ఎరువుగా వినియోగించనున్నట్లు తెలిపారు. సానిటరీ ఇన్‌స్పెక్టర్ అక్షయ్ కుమార్, ముజీబ్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.