రజనీకాంత్ హిమాలయాల్లో ఆధ్యాత్మిక యాత్ర
NEWS Oct 05,2025 05:01 pm
రజనీకాంత్ మానసిక ప్రశాంతత కోసం హిమాలయ యాత్రకు వెళ్లారు. ‘కూలీ’ షూటింగ్ పూర్తయిన తర్వాత, ‘జైలర్ 2’ ప్రారంభానికి ముందుగా వారం రోజుల విరామం తీసుకుంటూ రిషికేశ్, బద్రీనాథ్, మహావతార్ బాబాజీ గుహలను దర్శించారు. రోడ్డు పక్కన సింపుల్ అల్పాహారం తీసుకుంటూ, ధ్యానంలో మునిగిన రజనీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రజనీకాంత్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం తన ఆనవాయితీ, ఆధ్యాత్మికత శాంతి, తృప్తిని ఇస్తుందని తెలిపారు. యాత్ర ముగిశాక ఆయన ‘జైలర్ 2’ షూటింగ్‌లో చేరనున్నారు.