స్కూల్లో క్షుద్ర పూజల కలకలం
NEWS Oct 05,2025 04:29 pm
జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ జెడ్పీహెచ్‌ఎస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలతో క్షుద్రపూజలు నిర్వహించడం స్థానికుల్లో భయాందోళనకు కారణమైంది. దసరా సెలవుల అనంతరం పాఠశాల తిరిగి ప్రారంభమైన మొదటి రోజున విద్యార్థులు, ఉపాధ్యాయులు వరండాలో పూజా సామగ్రిని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వారు పరిసరాలను శుభ్రం చేయించి, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.