జగిత్యాల సెల్ షాప్‌లో అగ్ని ప్రమాదం
NEWS Oct 05,2025 04:31 pm
జగిత్యాల: పట్టణంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో ఉన్న ఒక సెల్ షాప్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదనపు సమాచారానికి, మంటలు ప్రారంభమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది, ప్రమాదంలో ఎవరికి గాయాలు ఏమైనా జరిగినట్టు సమాచారం లేదు.