ఉపాధి హామీ కార్మికులకు eKYC నమోదు
NEWS Oct 05,2025 04:37 pm
అనంతగిరి: ఆదివారం కనాపురం పంచాయతీ లో గ్రామీణ ఉపాధి పనుల లబ్ధిదారుల ఫోటోలను తీసి eKYC నమోదు చేసే కార్యక్రమాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు కె. కోటి, కె. భగత్రమ్ కలిసి నిర్వహించారు. ప్రతి ఉపాధి హామీ కార్మికుడికి eKYC తప్పనిసరిగా చేయడం ద్వారా అవినీతికి తావు ఉండకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రికార్డింగ్ చేయడం ద్వారా ఉపాధి హామీ పనుల్లో ఇకపై అవినీతికి చోటు ఉండదని, కూటమి ప్రభుత్వం క్రమబద్ధమైన, సమర్థవంతమైన విధానాన్ని చేపడతుందని లబ్ధిదారులకు వివరించారు. కార్యక్రమంలో సీనియర్ మేట్ కోర రామ్మూర్తి, కిలో ప్రసాద్, జన్ని రాజు తదితరులు పాల్గొన్నారు.