ఆస్ట్రేలియా క్రికెటర్ హర్జాస్ సింగ్ సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. వెస్ట్రన్ సబర్బ్స్ తరఫున ఆడిన భారతీయ మూలాలున్న హర్జాస్ కేవలం 141 బంతుల్లో 314 పరుగులు చేసి త్రిబుల్ సెంచరీ నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 35 సిక్స్‌లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో జట్టు 483 పరుగులు చేసింది. ప్రత్యర్థి సిడ్నీ 287 పరుగులకే ఆలౌటైంది. దేశీయ వన్డేల్లో హర్జాస్‌తో పాటు త్రిబుల్ సెంచరీ చేసిన వారు ముగ్గురే ఉన్నారు.