ప్రొద్దుటూరు శ్రీరామ్‌నగర్‌లో హృదయవిదారక ఘటన. డబ్బుల విషయంలో తల్లితో జరిగిన వాగ్వాదంతో కొడుకు యశ్వంత్‌కుమార్ రెడ్డి (బీటెక్) కోపంతో తల్లి లక్ష్మీదేవిని గొంతుకోసి హతమార్చాడు. ఆపై ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాడు. అరుపులు విన్న తండ్రి బయటకు రాగానే లోపలికి నెట్టి గది మూసేశాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.