ఉపాధి హామీ వేతనదారులకు ఈకెవైసీ నమోదు
NEWS Oct 05,2025 02:07 pm
అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీలో ఉపాధి పనులు, చెల్లింపుల కోసం పీల్డ్ అసిస్టెంట్లు కె. కోటి, కె. భగత్ ఆధ్వర్యంలో ఈకెవైసీ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇకపై ఉపాధి హామీ పనుల్లో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ మేట్ కోర రామ్మూర్తి, కిలో ప్రసాద్, జన్ని రాజు, వేతనదారులు తదితరులు పాల్గొన్నారు.