చెన్నైలో 80ల తారల రీయూనియన్
NEWS Oct 05,2025 01:51 pm
చెన్నైలో 80ల తారల రీయూనియన్ ఘనంగా జరిగింది. చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, రాధ, రమ్యకృష్ణ, జయసుధ, శోభన, నదియ.. 31 మంది నటులు హాజరయ్యారు. ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న చిరంజీవి, “నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ మర్చిపోలేని అనుభూతి. ఈ బంధం విడదీయరానిది” అని అన్నారు. ఈ వేడుక నవ్వులు, జ్ఞాపకాలతో నిండి పోయిందన్నారు.