MLC వద్దు.. MLA టికెట్‌కే డిమాండ్
NEWS Oct 05,2025 01:40 pm
TG: జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ తలమునకలై ఉండగా అజారుద్దీన్ రూపంలో మరో చిక్కుముడి ఎదురవుతోంది. గవర్నర్ కోటాలో ఇస్తానన్న MLC పదవికి న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తనను జూబ్లీహిల్స్ బరిలో దించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తనను తప్పించేందుకు ఓ మంత్రి ప్రయత్నించారని, ఆయనపై ఇప్పటికే AICC నేతకు ఫిర్యాదు చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్.