తాగిన మైకంలో బీరు సీసాతో దాడి
NEWS Oct 05,2025 01:35 pm
కోరుట్ల: మండలంలోని పైడుమడుగు గ్రామంలో మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన వినయ్, రాజేష్ ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. పాత కక్షల నేపథ్యంలో వినయ్, రాజేష్ పై బీరు సీసాతో దాడి చేసినట్లు సమాచారం. స్థానికులు గాయపడిన రాజేష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.