రోడ్డు పూర్తి చేయాలని గిరిజనుల విజ్ఞప్తి
NEWS Oct 05,2025 08:07 am
డుంబ్రిగూడ: మండలంలోని సోవ్వ పంచాయతీ పరిధిలోని మలింగ వలస–చామధ పాడు రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మట్టి రోడ్డు గోతులు ఏర్పడి, పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు ఊరట కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.