ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
NEWS Oct 04,2025 05:24 pm
కథలాపూర్: మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా, ఆనందభరితంగా జరిగాయి. ఆడపడుచులు తిరక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి “పోయిరా బతుకమ్మ పోయిరా” అంటూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగిపోయారు. గ్రామాల వారీగా మహిళలు తెచ్చుకున్న పిండివంటలను అందరికీ పంచుకుంటూ ఆనందంగా ఆస్వాదించారు. చెరువుల వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఘాట్లలో బతుకమ్మలను ఆంపుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.