వాడపల్లిలో అది కర్మయోగి గ్రామ సభ
NEWS Oct 04,2025 10:58 pm
రంపచోడవరం: వాడపల్లి పంచాయతీ వాడపల్లి గ్రామంలో ఆది కర్మయోగి అభియాన్ – రెస్పాన్సివ్ గవర్నెన్స్ కార్యక్రమం జరిగింది. వెనుకబడిన గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా తీసుకుని ప్రధానమంత్రి మోదీ స్ఫూర్తిదాయక దిశానిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రోగ్రాం గ్రామ ప్రజల్లో విశేష ఉత్సాహాన్ని రేపింది. గ్రామాభివృద్ధి కోసం రక్షిత మంచినీటి సరఫరా, గృహ నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, స్మశానవాటిక అభివృద్ధి వంటి పలు అంశాలను ఈ ప్రోగ్రాం ద్వారా అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వాడపల్లి గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం దత్తత గ్రామంగా ప్రకటించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.